కాళేశ్వరం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ - Relief and Rehabilitation Package for Kaleshwaram Residents
21:02 November 13
కాళేశ్వరం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాస ప్యాకేజీని నీటి పారుదల శాఖ ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలో గల ఎర్రవల్లి, సింగారం... ములుగు మండలంలోని మామిడ్యాల, తానేదార్‌పల్లి, బహిలంపూర్ గ్రామాల నిర్వాసితులకు ప్యాకేజీ వర్తించనుంది. 111 నిర్వాసిత కుటుంబాలతో పాటు 18 ఏళ్లు పైబడిన ఏడుగురికి పరిహారాన్ని చెల్లించనుంది. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్ల కోసం రూ.5.04లక్షలు, రూ.7.50 లక్షలు పరిహారం అందనుంది. 18 ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనుంది. రూ.14.26 కోట్లతో ప్యాకేజీ ప్రకటిస్తూ నీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి జీవన్‌రెడ్డి లేఖ
TAGGED:
kaleshwaram