తెలంగాణ

telangana

ETV Bharat / state

Himayat Sagar: హిమాయత్​సాగర్​కు భారీగా వరద... దిగువకు నీటి విడుదల - హిమాయత్ సాగర్ న్యూస్

ఇటీవల కురిసిన వర్షాలకు హిమాయత్​సాగర్(Himayat sagar) ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈమేరకు ఇవాళ అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా జలాశయంలో 1,762.90 అడుగుల నీరు ఉంది.

Himayat Sagar
హిమాయత్​సాగర్​

By

Published : Jul 20, 2021, 5:35 PM IST

Updated : Jul 20, 2021, 7:23 PM IST

హిమాయత్​సాగర్​కు భారీగా వరద...

రాజధానిలో రోజూ కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్‌ జలాశయం (Himayat sagar) నిండుకుండలా మారింది. ఈమేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ (Mla Prakash Goud) ఒక గేటు ఎత్తి మూసీలోకి నీరు వదిలారు.

ఒక గేటును 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 1,250 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా జలాశయంలో 1,762.90 అడుగుల నీరు ఉంది. మొదట మూడు గేట్లు ఎత్తాలని భావించారు. ప్రస్తుతం ఒక గేటును మాత్రమే ఎత్తారు. వరదను బట్టి మిగతా గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

  • హిమాయత్‌సాగర్

గరిష్ఠ నీటిమట్టం-1,763.50 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం-1,762.90 అడుగులు

సురక్షిత ప్రాంతాలకు తరలించండి...

హిమాయ‌త్​సాగ‌ర్ లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న కాల‌నీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంత ప్రజ‌ల‌ను వెంట‌నే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జలమండలి ఎండీ అధికారులను సూచించారు. అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టేందుకు సన్నద్ధం కావాల‌ని హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. హిమాయత్ సాగర్‌లోకి నీరు అధికంగా రావడంతో సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు ఉస్మాన్ సాగర్​లోనూ నీటిమట్టం పెరుగుతోంది. మరో 5 అడుగులు చేరితే గరిష్ఠస్థాయి అందుకుంటుందని అధికారులు తెలిపారు.

  • ఉస్మాన్‌సాగర్ జలాశయం

గరిష్ఠ నీటిమట్టం-1,790 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం-1,784.60 అడుగులు

ఇదీ చదవండి:Warning : మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ

Last Updated : Jul 20, 2021, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details