ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ రాసిన బైపీసీ అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మ్- డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించారు. ఈనెల 31, ఆగస్టు 1 తేదీల్లో ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి... ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆగస్టు 2, 3 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. అదే నెల 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు సమర్పించాలి. ఆగస్టు 6న మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఆగస్టు 6 నుంచి 10 వరకు ఆన్ లైన్లో బోధన రుసుములు చెల్లించి... కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు.
ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - బైపీసీ
ఎంసెట్ రాసిన బైపీసీ అభ్యర్థులకు బీఫార్మసీ, ఫార్మ్- డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించారు.
ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల