తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస ప్రవాస విభాగాల నేత తన్నీరు మహేశ్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం అమెరికా ఓహియో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో పీవీ శతజయంత్యుత్సవాల సభ జరిగింది. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సభలో కేకే మాట్లాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆన్‌లైన్‌లో పిటిషన్ విడుదల చేసినట్లు ఈ సందర్భంగా తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల చెప్పారు. అన్ని దేశాల్లో ఉన్న పీవీ అభిమానులు దీనికి మద్దతు తెలపాలన్నారు.
పీవీకి భారతరత్నతోనే సరైన గౌరవం: కేకే - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించి, ఖండాంతర ఖ్యాతి పొందిన పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ద్వారా సముచిత గౌరవం దక్కాలని తెరాస పార్లమెంటరీపక్ష నేత, పీవీ శతజయంత్యుత్సవాల కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని తెలిపారు. పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. 50 సంవత్సరాల నుంచి అమెరికాలో నివసిస్తున్న పీవీ మరో కుమార్తె కలకోట సరస్వతి కొలంబస్ సభలో పాల్గొని తన తండ్రి స్మృతులను గుర్తుచేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు, తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త కానుగంటి నవీన్, కొలంబస్ తెలుగు సంఘం ప్రతినిధి శ్రవణ్, భారతీయ సంఘాల సమాఖ్య నేత కాసర్ల రామకృష్ణ, ఒహియో తెలుగు సంఘం అధ్యక్షుడు జగన్ చలసాని, పీవీ అభిమానులు ఈ సభలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్ కంపెనీలో అమెరికన్ టీకా ఉత్పత్తి