ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 1 నుంచి జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూలును విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 1 నుంచి 19వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం.. మే 2 నుంచి మే 20 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులకూ ఇదే షెడ్యూలు వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - telangana varthalu
release-of-intermediate-exam-schedule
16:59 January 28
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కార్యదర్శి పేర్కొన్నారు. మానవ విలువల పరీక్ష ఏప్రిల్ 1న, పర్యావరణ పరీక్ష ఏప్రిల్ 3న ఉంటాయన్నారు. డెబ్బై శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రశ్నపత్రంలో మరిన్ని ఛాయిస్లు ఉండనున్నాయి. ప్రశ్నపత్రం, సిలబస్ వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
వివరాలు ఇలా..
క్ర.సం | పరీక్షలు | తేదీలు |
1. | ఇంటర్ మెుదటి సంవత్సరం | మే 1 నుంచి 19వరకు |
2. | ఇంటర్ ద్వితీయ సంవత్సరం | మే 2 నుంచి మే 20 వరకు |
3. | ప్రాక్టికల్స్ | ఏప్రిల్ 7 నుంచి 20 వరకు |
4. | మానవ విలువల పరీక్ష | ఏప్రిల్ 1న |
5. | పర్యావరణ పరీక్ష | ఏప్రిల్ 3న |
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్
Last Updated : Jan 28, 2021, 7:46 PM IST