ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో హ్యుమానిటీస్ కోర్సుల సిలబస్ సవరించారు. రెండో సంవత్సరం కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సవరించిన సిలబస్‌తో కూడిన కొత్త పుస్తకాలను శనివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి విడుదల చేశారు.
కొత్త సిలబస్‌తో ఇంటర్మీడియట్ పుస్తకాలు విడుదల - intermediate syllabus changed books released in telangana
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సవరించిన సిలబస్‌తో కూడిన కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ సవరిస్తుందని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
కొత్త సిలబస్‌తో ఉన్న ఇంటర్మీడియట్ పుస్తకాలు విడుదల
ఇంటర్ బోర్డు ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ సవరిస్తుందని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ప్రొఫెసర్లు, డిగ్రీ, జూనియర్ కాలేజీల లెక్చరర్లతో కూడిన కమిటీ సిలబస్‌ను సవరించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్‌తోనే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని జలీల్ తెలిపారు.
ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!