తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు రుణమాఫీకి నిధుల విడుదల - రుణమాఫీకి నిధుల విడుదల

Release of funds for agricultural loans
Release of funds for agricultural loans

By

Published : Mar 18, 2020, 5:39 PM IST

Updated : Mar 18, 2020, 7:36 PM IST

16:31 March 18

వ్యవసాయ రుణమాఫీకి నిధుల విడుదల

రాష్ట్రంలో రైతులకు ఉపశమనం కలుగనుంది. రుణమాఫీ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం... వెంటనే చర్యలకు ఉపక్రమించింది. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 25 వేల రూపాయల లోపు వ్యవసాయ పంట రుణాల మాఫీ కోసం నిధులు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల మేరకు ఇవాళ 1,210 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ... సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

            25 వేల రూపాయల వరకు వాణిజ్య, ఇతర బ్యాంకుల్లో వ్యవసాయ పంట రుణం ఉన్న రైతులకు చెక్కుల ద్వారా నగదు ఇవ్వనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రుణమాఫీ కోసం నిధులు మంజూరు చేయటం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులైన రైతులకు రుణమాఫీ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రుణమాఫీ పథకం 4 దశల్లో అమలు కానున్న విషయం విదితమే.

ఇవీ చూడండి:కరోనాపై గిరిజనులకు అవగాహన కల్పించండి: సత్యవతి రాఠోడ్

Last Updated : Mar 18, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details