Compensation Released: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల - Telangana farmers suicide
20:02 December 25
ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం
Compensation Released: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి ఆరు లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. మొత్తం 133 కుటుంబాలకు 7కోట్లా 95 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు విపత్తు శాఖ నిర్వహణా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లాలో 27 కుటుంబాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. నల్గొండలో 17, భూపాపలపల్లి 12, జనగాంలో 10, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 9 చొప్పున కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, వరంగల్, నిజామాబాద్లో 3 చొప్పున కుటుంబాలకు పరిహారం అందించారు. మహబూబాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో రెండు చొప్పున కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం అందించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: