హైదారాబాద్ రెయిన్బో పిల్లల ఆస్పత్రిలో సిబ్బందిపై ఓ పేషంట్ తరఫు బంధువులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న జరిగిన ఈ దాడికి సంబంధించి.. పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. డెంగ్యూ జ్వరంతో ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రికి చేరిన ఏడేళ్ల చిన్నారికి వైద్యులు చికిత్స చేసి కాపాడారు. దాదాపు గత పది రోజులుగా చిన్నారి ఆస్పత్రిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో బాలికను చూసేందుకు రాత్రి పూట ఆస్పత్రికి వచ్చిన బంధువులు ఆస్పత్రి లిఫ్ట్‌లో మొదట తమను పంపించాలని డిమాండ్ చేశారు.
బెదిరింపులు