వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం బొల్లారంలో వినోద్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడిని లోతుకుంటలోని లైఫ్ లైన్ మెడి క్యూర్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో అతను మరణించాడని విలపిస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.
బొల్లారం ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - బొల్లారంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ బొల్లారంలో బంధువులు ఆందోళనకు దిగారు.
బొల్లారం ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
రిసాలా బజార్‌కు చెందిన వినోద్ కుమార్‌కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారు సాయంత్రం బొల్లారం నుంచి అల్వాల్ వస్తున్న సమయంలో అతను ద్విచక్రవాహనం నుంచి కింద పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : బొల్లారం ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన