తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: విమ్స్​ ఆసుపత్రిలో మంత్రి అవంతికి చేదు అనుభవం - news on vims

ఏపీ విశాఖ విమ్స్​ ఆసుపత్రిని పరిశీలించడానికి వచ్చిన మంత్రి అవంతి శ్రీనివాసరావును కొందురు అడ్డుకున్నారు. కరోనా రోగులకు హాస్పటల్లో సరైన సదుపాయాలు అందించడం లేదు యాజమాన్యంపై కేసు పెడతామంటూ వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

relatives-of-corona-patients-who-deposed-minister-avanti-in-vims
ఏపీ: విమ్స్​ ఆసుపత్రిలో మంత్రి అవంతిని అడ్డుకున్న ప్రజలు

By

Published : Aug 3, 2020, 4:47 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖ విమ్స్ ఆసుపత్రిలో మంత్రి అవంతి శ్రీనివాసరావును కొందరు అడ్డుకున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న తమ తండ్రి చనిపోయిన విషయాన్ని చెప్పలేదంటూ... బాధిత కుటుంబసభ్యులు అవంతిని నిలదీశారు. మరణవార్త దాచిపెట్టి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవంటూ మరికొందరు ఆయన్ను అడ్డగించారు.

అనంతరం అవంతి మీడియాతో మట్లాడుతుండగా ఓ మహిళ అడ్డుకుంది. తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వాపోయింది. విమ్స్ ఆస్పత్రి వైద్యులపై కేసు పెడతానంటూ మంత్రి ముందు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details