తెలంగాణ ఆబ్కారీశాఖ (Excise Department Telangana)లో అడ్‌హాక్ ఎస్సైలకు హెడ్‌కానిస్టేబుళ్లుగా రివర్షన్ ఇచ్చే అంశంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆబ్కారీ శాఖ(Excise Department Telangana)లో గ్రూప్-2లో ఎంపికైన ఎక్సైజ్ ఎస్సైల (Excise SI) భర్తీకి అనువుగా తాత్కాలికంగా పదోన్నతులు పొందిన అడ్‌హాక్ ఎస్సైల (Excise Inspector) స్థాయిని తగ్గించేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దానిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ గత నెలలో 73 మంది అడ్‌హాక్ ఎస్సైల (Excise Inspector ) కు నోటీసులు జారీ అయ్యాయి. గడువు ముగిసినా గ్రూప్-2 ఎస్సైలను భర్తీ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి 2020లో విధుల్లో చేరిన 280 మంది గ్రూప్-2 ఎస్సైలకు ఏడాదిన్నరగా రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వలేదు. ఇప్పటికీ పలు స్థానాల్లో అడ్‌హాక్ ఎస్సైలు (Excise Inspector ) ఉండటం ఇందుకు అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో వారి స్థాయిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్-2 ఎస్సైలకు మార్గం సుగమమైందనే భావన వ్యక్తమైంది.
Excise Department: గ్రూప్-2 ఎస్సైలకు రెగ్యులర్ పోస్టింగుల్లో మీనమేషాలు.. వారే కారణమా? - Regular Postings for Group-2 SI in excise department in telangana
గడువు ముగిసినా ఆబ్కారీశాఖలో గ్రూప్-2 ఎస్సైలకు రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. కొత్త మద్యం దుకాణాలు తెరిచే దాకా కొందరు ఈ ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. కొత్తగా లైసెన్స్ పొందిన వ్యాపారులు దుకాణాలను ప్రారంభించే సమయంలో.. గుడ్‌విల్ కింద కొంతమొత్తం సమర్పించుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు.. ఎస్సైల భర్తీ జరగకుండా అడ్డుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అడ్‌హాక్ ఎస్సైల స్థాయిని తగ్గించకుండా జరుగుతున్న ప్రయత్నాల వెనక ‘గుడ్‌విల్ గూడుపుఠాణి’ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్సైజ్ కొత్త మద్యం పాలసీ (Telangana Government Issues New Liquor Policy) కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. డిసెంబరు 1 నుంచి కొత్తగా లైసెన్స్ పొందిన వ్యాపారులు దుకాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఆ సమయంలో వ్యాపారులు గుడ్‌విల్ కింద కొంతమొత్తం సమర్పించుకునే అవకాశాలున్నాయి. అందువల్లే అడ్‌హాక్ ఎస్సైల (Excise Inspector)ను కొన్నిరోజుల పాటు కొనసాగించేలా ఇద్దరు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్-2 ఎస్సైల కన్నా ‘అనుభవజ్ఞులు’ అయిన అడ్‌హాక్ ఎస్సైలు (Excise Inspector) కొనసాగితేనే తమకు సులభంగా ‘ఆదాయం’ లభిస్తుందనే ఉద్దేశం వారికున్నట్లు తెలుస్తోంది. అందుకే పలువురు అడ్‌హాక్ ఎస్సై (Excise Inspector)ల తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవడమే కాక, వారికి భరోసా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇవీ చూడండి:
- Excise Department Telangana: 'ఎక్సైజ్' ఎస్సైలకు దర్యాప్తు అధికారమే లేదు.. కార్యాచరణ ఎలా సాధ్యం?
- కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..?
- జీతం, హోదా లేని ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్లు.. ఇలాంటి పోస్టులు కూడా ఉంటాయా..!
- Liquor Shop License: మద్యం దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక ప్రక్రియ నేడే..
- Srinivas Goud: నూతన మద్యం పాలసీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ...
- 'మద్యం కొనేవారిని 'పశువులు'గా చూడకండి'
- బెల్టు షాపుల వివాదం.. ఎక్సైజ్ సీఐ బూతు పురాణం