నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు - వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
20:02 December 10
నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే స్లాట్ల బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించింది. అందుకు అనుగుణంగా రేపట్నుంచి స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. 93 రోజుల తర్వాత వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి