తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్లు - registrations increse after lockdown

లాక్​డౌన్​ సడలింపులతో రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 18 రోజుల్లోనే 4 వందల72 కోట్ల మేర ఆదాయం వచ్చింది. మాస్కులు, గ్లౌజులు ధరించినవారినే లోపలికి పంపిస్తున్నారు అధికారులు.

registrations increase in telanagana
తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్లు

By

Published : Jun 3, 2020, 11:13 AM IST

రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల సడలింపుతో మే 11 నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు, ఉద్యోగులు... మాస్క్‌లు, గ్లౌజులు ధరించి విధులకు హాజరవుతున్నారు.

సామాజిక దూరం పాటించేట్లు చర్యలు తీసుకున్న అధికారులు శానిటైజర్లు, మాస్కులు ధరిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చే వారు... ముందు ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌లను బుక్‌ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజుకి 2 వేలకు పైగా స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి . 18 రోజుల్లో 4 వందల 72 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ABOUT THE AUTHOR

...view details