తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం - Registration of non-agricultural assets resume

మూణ్నెళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. హైకోర్టు అనుమతి నేపథ్యంలో స్లాట్ల బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు. నేటి నుంచి స్లాట్ల బుకింగ్, 14వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్​కే భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Registration of non-agriculture land restart today in Telangana
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం

By

Published : Dec 11, 2020, 3:17 AM IST

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ధరణి వేదికగా జరపాలనే యోచనతో రాష్ట్రంలో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ధరణిలో ఆధార్‌ వంటి వివరాల నమోదుకు అభ్యంతరాలు వ్యక్తం కావడం, కోర్టు కేసుల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్‌కు నిర్దేశించారు.

స్లాట్ల బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించింది. దీంతో స్లాట్ల బుకింగ్ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు ఆన్​లైన్ విధానంలో నిర్ణీత రిజిస్ట్రేషన్, ఇతర రుసుము చెల్లించి ఆ తర్వాత స్లాటు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా నేటి నుంచి ఈ విధానంలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. స్లాట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు 14వ తేదీ నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభమవుతాయి. స్లాట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే నిర్ణీత తేదీ, సమయం రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముందుగానే స్లాట్లు బుకింగ్ చేసుకోకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు జరగవని స్పష్టం చేసింది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి :'నేరచరిత గల నేతల కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details