ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు
17:00 February 16
ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు
ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియ కీలక దశకు చేరింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సహా నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. అభియోగపత్రంలో అనిశా పేర్కొన్న అభియోగాలను రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్కు న్యాయమూర్తి చదివి వినిపించారు. అనిశా అభియోగాల్లో నిజం లేదని, విచారణ ఎదుర్కొంటామని రేవంత్ రెడ్డి, ఇతర నిందితులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్సింహా, సెబాస్టియన్లపై కలిపి విచారణ చేపట్టాలని అనిశా న్యాయస్థానం నిర్ణయించింది. సాక్షుల విచారణకు ఈనెల 19న షెడ్యూలు ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ