తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు(Telangana stamps and registration dept) మొదటి ఆరు నెలల్లో 5.49 లక్షలు రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.4,008.50 కోట్ల రాబడి వచ్చింది. కరోనా ప్రభావంతో మొదట ఆశించిన మేరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు(land registrations). సాంకేతిక కారణాలు, కొవిడ్ ప్రభావంతో కొన్ని రోజుల పాటు రిజిస్ట్రేషన్ల నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయి. సెప్టెంబర్ నెలలో 99,304 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా రూ.889.90 కోట్లు రాబడి వచ్చింది. మొదటి ఆరు నెలల కాలంలో వచ్చిన రూ.4008.50 కోట్లు మొత్తం రాబడిని తీసుకుంటే నెలకు సగటున రూ. 668 కోట్లు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే ఆరు నెలలుపాటు రాబడి వచ్చినట్లయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.8 వేల కోట్లకు మించి రాబడి వచ్చే అవకాశం లేదు.
లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీగా చేయాలి
ప్రభుత్వం నిర్దేశించిన రూ.12,500 కోట్లు లక్ష్యాన్ని చేరుకోవాలంటే రిజిస్ట్రేషన్లు భారీగా చేయాల్సి ఉంది. రాబోయే ఆరు నెలలు పాటు.. నెలకు సగటున రూ.1,416 కోట్లు రాబడి ఉండాలి. అంటే ఇప్పుడు వస్తున్న రాబడి కంటే మరో రూ.526 కోట్లు అదనపు రాబడి రావాల్సి ఉంది.