ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రామవరం గ్రామానికి చెందిన కలుము రాజి.. నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది వెంటనే బయలుదేరారు. అయితే దారి సరిగ్గా లేక రామావరం గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బంజరగూడెం వరకే అంబులెన్స్ వెళ్లింది.
మూడు కిలోమీటర్లు కాలినడక...
గ్రామానికి వెళ్లడానికి మరో దారిలేక సిబ్బంది స్ట్రెచర్ తీసుకుని సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అప్పటికే గర్భిణి బంధువులు డోలి కట్టుకుని ఎదురుగా ఆమెను తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వాహనం వరకు తీసుకెళ్లారు. అక్కనుంచి తెలంగాణలోని భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది కె.రమాదేవి, చంద్రశేఖర్‌ను మహిళ కుటుంబ సభ్యులు అభినందించారు.