Recycling StartUp Company Gives Petrol To Garbage : రోజురోజుకూ మారుతున్న సాంకేతికతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. మరి ఆ టెక్నాలజీని వాడుకుంటూ.. పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. ప్రజలకు ఉపయోగపడేలా ఇండియన్ ఆయిల్ సంస్థ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ రిసైకల్ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. వీటి పని వినియోగదారుని నుంచి చెత్తను సేకరించి.. దానికి పరిహారంగా పెట్రోల్‌ను ఇవ్వడమే. ఈ అవకాశం మరెక్కడో కాదండి బాబోయ్.. మన భాగ్యనగరంలోనే ఫైలన్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
Petrol Is Free Motorists Bring Garbage : గత నెల జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు కూడా పెట్రోల్, డీజిల్‌పై తగ్గింపు లభిస్తుండటంతో ప్రజలు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న ఈ వేస్ట్, పాత పేపర్లు, ప్లాస్టిక్ వేస్ట్ వంటి చెత్తను బయటపడేయకుండా నగరంలో ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఉన్న రిసైకల్ ప్రతినిధులకు ఇస్తే చాలు. అక్కడే మీరు అందుకు తగిన పెట్రోల్‌ను వాహనంలో నింపుకోవచ్చు.