తెలంగాణలో తగ్గిన నిరుద్యోగరేటు తగ్గింది. నవంబరు నెలకు 1.5 శాతం ఉన్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) సర్వేలో వెల్లడైంది. గడిచిన డిసెంబరులో 2.3 శాతంగా నమోదైన తరువాత అత్యల్ప నిరుద్యోగ రేటు గతనెలలో నమోదైంది. కొవిడ్ సమయంలో నిరుద్యోగ రేటు అధికంగా నమోదైనప్పటికీ.. అన్లాక్ ప్రక్రియ మొదలైన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అక్టోబరు నెలతో పోల్చితే దాదాపు 50 శాతం వరకు నిరుద్యోగ రేటు తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. అదేసమయంలో దేశవ్యాప్త నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. నవంబరు నెల నాటికి 6.26 శాతంగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా 7.07 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా తగ్గి 6.51 శాతానికి పరిమితమైంది.
ఏడు రాష్ట్రాల్లో 2 శాతం లోపు...