హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బుధవారం రోడ్లు నదులను తలపించాయి. ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. నిన్నటితో పోల్చితే చాదర్ఘాట్ వద్ద మూసీనది ప్రవాహం కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే వంతెనపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహయక చర్యలను మమ్మురం చేశారు.
మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం - Musi River flood Update
మూసీకి మునుపెన్నడూ లేనంత భారీగా వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారిగా 2.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. బుధవారంతో పోల్చితే వరద ప్రవాహం కాస్త తగ్గింది.
![మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం Reduced flood flow into the Musi River](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9179269-342-9179269-1602738474945.jpg)
మూసీకి తగ్గిన వరద ప్రవాహం