రాజభవన్ ఆడిటోరియంలో రెడ్‌క్రాస్ సొసైటీ మూడో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్ని విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు సభ్యత్వాలు తీసుకొని సేవ చేసేలా చూడాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. వివిధ కార్యక్రమాల ద్వారా రెడ్ క్రాస్ సంస్థ ఎన్నో సేవలు చేస్తోందని కొనియాడారు. జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం చాలా అవసరమని ఇందుకోసం కలెక్టర్లు చొరవ చూపాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్ క్రాస్ తరఫున సేవలు అందించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై అవార్డులను ప్రదానం చేశారు.
'రక్తం కొరతతో ఏ ఒక్క ప్రాణం పోకూడదు' - Red Cross society Third Annual General Meeting in Telangana
నవంబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో రెడ్ క్రాస్ సభ్యత్వం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. రక్తం కొరతతో ఎవరూ చనిపోరాదన్న లక్ష్యంతో రెడ్ క్రాస్ పనిచేయాలని సూచించారు.
'రక్తం కొరతతో ఏ ఒక్క ప్రాణం పోకూడదు'