తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో రెడ్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు - red alert for telangana

red alert issued for telangana: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెండు రోజుల పాటు రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల రెండ్రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

rain
తెలంగాణకు రెడ్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

By

Published : Jul 8, 2022, 6:19 PM IST

Updated : Jul 8, 2022, 10:06 PM IST

తెలంగాణకు రెడ్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

red alert issued for telangana: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండ్రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని వెల్లడించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించింది.

రాగల మూడు గంటల్లో.. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీమ్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌, హనుమకొండ, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్‌, సూర్యాపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం పేర్కొంది.

రాగల రెండు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. రెండు రోజుల పాటు ఎరుపు, ఆ తరువాత ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశాం. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ముఖ్యంగా భారీ వర్షాలు, అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. - డాక్టర్‌.నాగరత్న, వాతావరణ శాఖ సంచాలకులు

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!

Last Updated : Jul 8, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details