తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యఆరోగ్య శాఖలో కొలువుల జాతర.. 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ - Filling the posts of Staff Nurse

Recruitment of medical related jobs in Telangana:అటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోనూ కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. దీంతో ఈ ఏడాది మొత్తం 7వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టువుతుందని మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Recruitment of medical related jobs
వైద్యఆరోగ్య శాఖలో 10,902 పోస్టుల్లో 7,320 పోస్టుల భర్తీ

By

Published : Dec 31, 2022, 11:43 AM IST

వైద్యఆరోగ్య శాఖలో 10,902 పోస్టుల్లో 7,320 పోస్టుల భర్తీ

Recruitment of medical related jobs in Telangana: కొత్త సంవత్సర వేడుకల వేళ సర్కారు నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 5,204 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా డీఎమ్​ఈ, డీహెచ్​ పరిధిలోని 3,823 స్టాఫ్ నర్సుల పోస్టులు సహా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 757, ఎమ్​ఎన్​జే ఆస్పత్రిలో 81, వృద్ధులు, వికలాంగుల సంరక్షణ విభాగంలో 8, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీలో 197, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ లో 74, తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీలో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీలో 13 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అర్హులైన వారు జనవరి 25 ఉదయం పదిన్నర నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల నోటిఫికేషన్: కొత్త సంవత్సరంలో మెడికల్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కింద అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు భావిస్తోంది. మొత్తం వైద్యారోగ్య శాఖలో 10,902 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సర్కారు గుర్తించింది. అందులో ఇటీవలే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను సర్కారు భర్తీ చేయటంతో పాటు వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మరో 1147 పోస్టులకు డిసెంబర్ 19న నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మొత్తం గుర్తించిన 10,902 పోస్టుల్లో ఇప్పటికే 7,320 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

త్వరలో భర్తీ: మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8 వైద్యకళాశాలలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా పోస్టులను సైతం సర్కారు త్వరలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సంబంధిత వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఇప్పటికే నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ సహా నూతన సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో భారీగా కొలువులు భర్తీ కానున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details