TSRTC Single Day Income: తెలంగాణ ఆర్టీసీకి సోమవారం కాసుల పంట పండింది. గడిచిన మూడు నెలల్లో మునుపెన్నడూ రానంతటి ఆదాయం సమకూరింది. సోమవారం ఒక్క రోజే రూ.15.59 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో లభించింది. ఆక్యుపెన్సీ కూడా రికార్డు స్థాయిలో 85.10 శాతం నమోదు అయింది.
TSRTC Single Day Income: ఒక్కరోజే టీఎస్‌ఆర్టీసీకి రికార్డుస్థాయి రాబడి
TSRTC Single Day Income: తెలంగాణ ఆర్టీసీ రాబడిలో రికార్డులను తిరగరాసింది. ఆదాయం నుంచి ఆక్యుపెన్సీ వరకు అత్యధికంగా నమోదైంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం వచ్చే ఆదాయం ఒకింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సోమవారం(జూన్ 6) రికార్డుస్థాయిలో రూ.13.64 కోట్లు లభించింది.
ఒక్కరోజే టీఎస్‌ఆర్టీసీకి రికార్డుస్థాయి రాబడి
ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తం నమోదు అయిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. 34.69 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడిపారు. 34.17 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చారు. సోమవారం రూ.13.64 కోట్లు ఆర్జించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటే అదనంగా మరో రూ.1.95 కోట్లు వసూలు అయింది. కరోనా తరవాత ఇంత పెద్ద మొత్తంలో వసూలు కావడం ఇది రెండో సారి.