కరోనా నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. మే నెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి రాయితీ కింద ఎర్లీబర్డ్ పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రకటించింది. 2020-21 ఏడాదికి ఈ పథకం కింద రూ. 575 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది.
రెండు నెలల్లోనే రూ.575 కోట్ల ఆస్తి పన్ను వసూలు - జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూల
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2020-21 సంవత్సరానికి గాను రూ.575 కోట్ల ఆస్తి పన్ను రాబడిగా వచ్చింది. అయితే మే నెల 31లోపు ఈ పన్ను చెల్లించే వారికి ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా కేవలం రెండు నెలల్లోనే రూ. 575 కోట్లు వసూలు అయింది.
రెండు నెలల్లోనే 575 కోట్ల ఆస్తి పన్ను వసూలు
గతేడాది 2019-20కి గాను రూ. 574.88 కోట్ల ఆస్తి పన్ను రాబడి రాగా.. కేవలం రెండు నెలల్లోనే రూ. 575 కోట్లు వసూలు కావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు