Power Demand Increased Today in Telangana: రాష్ట్రంలో కరెంట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో మరోమారు ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగినట్లుగా విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇవాళ ఉదయం 11.01 నిమిషాలకు 15, 497 మెగావాట్ల అత్యధిక పీక్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు. ఇదే రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగంగా విద్యుత్ శాఖ తెలిపింది.
మార్చ్ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదువుతోందని వెల్లడించింది. అయితే విద్యుత్ వినియోగలో దక్షిణదిన తెలంగాణ రెండోవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడం, వేసవి కాలం కావడంతో ఇళ్లల్లో కూడా కరెంట్ వినియోగం భారీగా పెరుగుతోంది. మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 37 శాతం వాడుతుండగా.. మిగిలిన కరెంట్‌ను పారిశ్రామిక, ఇంకా తక్కిన రంగాలకు వినియోగిస్తున్నారు.
Power consumption increased in Telangana today: మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే.. రెండోవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మార్చ్ 13న 14,138 మెగావాట్లు కాగా.. మార్చ్ 14వ తేదీన 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,497 మోగావాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోవసారి.