ప్రయాణికుల రవాణలో దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. 2018-19 ఏడాదిలో ప్రయాణికుల రవాణ ద్వారా 4 వేల 59 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 8 శాతం అదనంగా వచ్చినట్లు తెలిపారు. భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చిన రెండో ఉత్తమ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే పేరు సంపాదించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ... 383 మిలియన్ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సాధించింది.
ఆదాయంలో దూకుడు పెంచిన దక్షిణ మధ్య రైల్వే - సికింద్రాబాద్
ఎక్కువ మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలుకు చేరుస్తూ... 4.59 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది దక్షిణ మధ్య రైల్వే.
![ఆదాయంలో దూకుడు పెంచిన దక్షిణ మధ్య రైల్వే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3099658-thumbnail-3x2-scr1.jpg)
ఆదాయంలో దూసుకెళ్తున్న దక్షిణ మధ్య రైల్వే
Last Updated : Apr 25, 2019, 8:34 AM IST