Reconciliation between Rayapati and Kanna: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై కోర్టులో విచారణ జరిగింది. 2010లో రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై.. కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఈ రోజు విచారణలో భాగంగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కోర్టులో రాయపాటి, కన్నాలు తెలిపారు. న్యాయమూర్తి సమక్షంలో రాయపాటి, కన్నా రాజీకి వచ్చామని చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. కోర్టు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిరింది.