బడులు మూసివేయాలని సూచించాం: డీహెచ్ శ్రీనివాస్ - Schools closed in telangana
15:33 March 23
బడులు మూసివేయాలని సూచించాం: డీహెచ్ శ్రీనివాస్
రాష్ట్రంలో కరొనా మళ్లీ విజృంభిస్తున్న వేళ.. వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కేసుల నియంత్రణ, పరీక్షల పెంపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో.. గాంధీ ఆసుపత్రిని అవసరమైతే.. కొవిడ్ చికిత్సకు వినియోగించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ ఈ విషయాన్ని తెలిపారు. వైరస్ బాధితుల కోసం పడకలు పెంచుతామని ప్రకటించారు.
పాఠశాలలు, హాస్టళ్లలో కేసులు పెరుగుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. పరీక్షల సంఖ్యలో అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి:విద్యార్థులపై కరోనా పంజా.. రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందా?