తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం పదిన్నరకు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు జారీచేస్తారు. పదోతేదీ వరకు నామినేషన్లు స్వీకరించి.. పదకొండున పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు పద్నాలుగో తేదీ వరకు గడువు ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం నామినేషన్లు తిరస్కరణకు గురైన వారు ఈనెల 12వ తేదీన అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్లు పరిష్కరించాకే పద్నాలుగో తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది.

receiving-municipals-nominations-from-today
పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

By

Published : Jan 8, 2020, 5:13 AM IST

పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

రాష్ట్రంలో మొదటి సాధారణ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. గత నెల 23వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు అనుగుణంగా స్థానిక రిటర్నింగ్ అధికారులు ఇవాళ వార్డు సభ్యుల ఎన్నిక కోసం నోటీస్ జారీ చేస్తారు. సంబంధిత వార్డు రిజర్వేషన్‌ను ప్రస్తావిస్తూ ఎన్నికల నోటీస్ విడుదల చేస్తారు. నోటీస్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవాళ్టి నుంచి పదో తేదీ వరకు ఉదయం10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు 12వ తేదీ సాయంత్రం 5గంటల లోపు జిల్లా ఎన్నికల అధికారి, అదనపు, ఉప జిల్లా ఎన్నికల అధికారి లేదా.. వారు నిర్దేశించిన అధికారి వద్ద అప్పీలు దాఖలు చేయవచ్చు. వచ్చిన అప్పీళ్లను సంబంధిత అధికారులు 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు పద్నాలుగో తేదీ మూడు గంటల వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసి వారికి గుర్తులను కేటాయిస్తారు. 22వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు 25వ తేదీ ఉదయం 8 గంటలకు చేపడతారు.

వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో పాటు.. కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ల రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మేయర్లు, ఛైర్ పర్సన్ల పరోక్ష ఎన్నిక కోసం పాలకమండళ్ల మొదటి సమావేశ తేదీని తరువాత ప్రకటిస్తామని.. రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోను నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ దాని ప్రతిని రిటర్నింగ్ అధికారికి నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోరు. నామినేషన్ లో నమోదు చేయాల్సిన వివరాలు ఇతర సమాచారం కోసం ఆన్ లైన్ విధానాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 13వ తేదీన ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details