కాంగ్రెస్‌లో పదవి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదంటూ ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన తమ వాళ్లు తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన రేవంత్... శాసనసభ 14 రోజుల కంటే తక్కువ జరగడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. విద్యుత్‌పై చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదన్న రేవంత్... హుజూర్నగర్ ఉపఎన్నిక టికెట్ అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని పేర్కొన్నారు. హుజూర్నగర్ స్థానానికి శ్యామల కిరణ్ రెడ్డిని తను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.యురేనియంపై సంపత్ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు.
కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో..! - MP
తమ పార్టీ నేతల తీరుపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక టికెట్ అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని.. ఈ అంశంపై ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
congress