రాష్ట్రంలో లాక్డౌన్ వేళ పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ వ్యాపారి రవీందర్ రెడ్డి సూచించారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్ తార్నాకలోని అడ్డా కూలీలు, మహిళా సంఘాలకు తనవంతు సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'పేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలి' - LOCK DOWN EFFECTS
హైదరాబాద్ తార్నాకలోని అడ్డా కూలీలు, మహిళా సంఘాలకు రియల్ఎస్టేట్ వ్యాపారి రవీందర్రెడ్డి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని రవీందర్ కోరారు.
'పేదలను ఆదుకునేందుకు ప్రతీఒక్కరు ముందుకురావాలి'
ఈ కార్యక్రమానికి లాలాగూడ సీఐ శ్రీనివాస్ పాల్గొని పేదలకు బియ్యం, కందిపప్పు, నూనె, నిత్యావసర సరుకులు అందజేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకుంటున్న రవీందర్ రెడ్డిని పోలీసులు అభినందించారు. వైరస్ నిర్మూలన కొరకు ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించి ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు.