దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలో డాక్టర్ ఆదర్శ కుమార్, అభిషేక్ కుమార్, వరుణ్‌చంద్రతో కూడిన వైద్యుల బృందం ఈరోజు గాంధీ ఆసుపత్రికి వచ్చారు.
'దిశ' నిందితుల మృతదేహాలకు కొనసాగుతున్న రీపోస్టుమార్టం - re postmortem for the Disha ded bodies
దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను రీ పోస్టుమార్టం జరుగుతోంది. దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన వైద్యుల బృందం చేపట్టింది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

కొనసాగుతున్న దిశ' నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం
ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేస్తారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కో మృతదేహానికి రెండు గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం మృత దేహాలను బంధువులకు అప్పగించనున్నారు. నిందితుల కుటుంబసభ్యులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిశ హత్యకేసు నిందితులకు ఈ రోజు సాయంత్రంలోగా రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కొనసాగుతున్న దిశ' నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం
ఇదీ చూడండి : అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి
Last Updated : Dec 23, 2019, 11:42 AM IST