ఎన్నికల్లో ఓట్ల కోసం భాజపా ఏమైనా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో పాల్గొన్న కుంతియా... రాష్ట్రంలో తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పోలీసులు రాజ్యాంగబద్దంగా పని చేయాలన్న కుంతియా.... తిరంగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. శరణార్ధులకు ఆశ్రయం కల్పించేందుకు పౌరసత్వం ఇవ్వడానికి మతంతో ఎందుకు ముడి పెడుతున్నారని ప్రశ్నించారు. భాజపా చర్యలతో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని కుంతియా మండిపడ్డారు.
'తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పనిచేస్తున్నాయి' - RC KUNTHIYA FIRE ON BJP, TRS, MIM IN CONGRESS MEETING
హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా పాల్గొన్నారు. భాజపా, తెరాస, ఎంఐఎంలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెరాస, ఎంఐఎంలు ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నాయని కుంతియా ఆరోపించారు.
RC KUNTHIYA FIRE ON BJP, TRS, MIM IN CONGRESS MEETING