తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా... ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాయకంటి ప్రతాప్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని... ప్రతాప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఎన్నిక - నాంపల్లి వార్తలు
ప్రస్తుతం టీఎన్జీవో నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాయకంటి ప్రతాప్... నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపి... ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రతాప్ హామీ ఇచ్చారు.
టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఎన్నిక
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ ప్రధాన కార్యదర్శిగా పోటీ పడ్డారు. రాష్ట్ర కార్యవర్గంలోని అందరి అభిప్రాయాలను తీసుకొని ప్రతాప్‌ను ఎన్నుకున్నట్లు సంఘం అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న వారికి ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఐటీ షేర్ల దూకుడుతో స్వల్ప లాభాలు
Last Updated : Sep 7, 2020, 6:34 PM IST