తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చిమాంసం తినొద్దన్నందుకు గొడవ- యువకుడి దారుణ హత్య - Young Man Murder in Hyderabad

Raw Meat Murder in Hyderabad : పచ్చిమాంసం​ తినొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి యువకుడిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మృతిని భార్యపైనా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హైదరాబాద్​లోని తుకారాంగేట్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Raw Meat Murder in Hyderabad
Raw Meat Murder

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 12:47 PM IST

Raw Meat Murder in Hyderabad :హైదరాబాద్‌లోని తుకారాంగేట్​లో దారుణం చోటు చేసుకుంది. పచ్చిమాంసం తినొద్దన్నందుకు ఓ వ్యక్తి యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా అతడి భార్యపైనా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు మరణించగా అతడి భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :హైదరాబాద్​లోని తుకారాంగేట్‌ మరాఠా బస్తీకి చెందిన అజయ్‌ కాంబ్లే (22) వృత్తిరీత్యా వివాహాది శుభకార్యాలకు బ్యాండ్‌ కొడతా జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర కిందట బంధువుల అమ్మాయి ప్రియాంకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 8 నెలల పాప ఉంది. కొన్నేళ్లుగా మరాఠా బస్తీలో నివాసమున్న ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో అక్కడ ఖాళీ చేసి, గోల్‌బావి సమీప బస్తీలో ఏడాది నుంచి అద్దెకు ఉంటున్నారు. అజయ్‌ ఇంటి పక్కనే అతని సోదరుడు లకన్‌ కాంబ్లే, అతని బావ రవి కుటుంబం, అక్కడే మూడు ఇళ్లలో అద్దెకుంటున్నారు.

Man killed Young Man Telling Him Not to Eat Raw Meat : ఇళ్ల యాజమాని మహేందర్‌ ప్రతినెల వారి నుంచి అద్దె వసూలు చేయడానికిగాను శ్రీనివాసా చారి(42) అనే వ్యక్తిని పక్కనే మరో ఇంట్లో ఉంచాడు. ఇతడు ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. తరచూ కల్లు తాగడం, ఆ మత్తులో ఇరుగుపొరుగుతో గొడవలు పడుతుండేవాడు. సంక్రాంతి రోజు ఉదయం సుమారు పదిన్నర గంటలకు శ్రీనివాసాచారి తన ఇంట్లో కూరగాయల కత్తితో కట్ చేస్తూ పచ్చి మాంసం తింటున్నాడు. సమీపంలో ఉన్న అజయ్‌, అతని భార్య ప్రియాంక దీనిని గమనించారు. 'పచ్చిమాంసం ఎందుకు తింటున్నావ్‌, వండుకొని తినొచ్చు కదా' అని శ్రీనివాసాచారిని అడిగారు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య మాటామాటా పెరికి వాగ్వాదం జరిగింది.

మటన్​ బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లు - చితకబాదిన వెయిటర్లు ​

Young Man Murder in Hyderabad : తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాసాచారి పక్కనే ఉన్న కత్తితో అజయ్ భార్య ప్రియాంకపై దాడి చేశాడు. దీంతో ఆమెకు చేతివేళ్లకు గాయాలయ్యాయి. అజయ్‌పైనా కూడా దాడికి దిగి అతనిని పొట్టలో పొడిచాడు. అప్రమత్తమైన బంధువులు వెంటనే అజయ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఘటనా స్థలిని మహంకాళి ఏసీపీ రవీందర్‌, క్లూస్‌టీం పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. అజయ్‌ను హత్య చేసిన శ్రీనివాసాచారిని తమకు అప్పగించాలంటూ మరాఠా బస్తీ వాసులు, అజయ్‌ బంధువులు తుకారాంగేట్‌ పోలీస్​ స్టేషన్​కు సోమవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. నిందితుడిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో వారంతా తిరిగి వెళ్లిపోయారు.

నేను బిర్యానీలో రైతా తినడం మానేశాను బ్రదర్.. పెరుగు అడిగితే కొట్టి చంపారట.. హోటల్​లో డ్రగ్స్ సరఫరానట.. ఏంటీ బ్రో ఇది

Hyderabad Hotel Staff Beating Customers : బిర్యానీ తినడానికి రెస్టారెంట్​కు వెళ్తే.. తిట్లు.. తన్నులు వడ్డిస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details