మూడేళ్లలో రాష్ట్ర ప్రగతి పెరిగిందా తగ్గిందా, ఆర్థిక వనరులు పెరిగాయా తగ్గాయా అనే విషయం స్పష్టం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రెండు లక్షల 81 వేల కోట్లకు చేరుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, డబుల్ బెడ్ రూమ్ వంటి అంశాలు బడ్జెట్‌లో లేకపోవటాన్ని తప్పుబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రగతి పెరిగిందా తగ్గిందా: రావుల
తెలంగాణ సంపన్న రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర ప్రగతి పెరిగిందా తగ్గిందా: రావుల