ఉన్నపళంగా కొత్త అసెంబ్లీ, భవనం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం మార్చడానికి గల కారణాలను ఎవరూ చెప్పటం లేదని పేర్కొన్నారు. అనవసరంగా భవనాలు నిర్మించి ప్రజల డబ్బును వృథా చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడున్న భవనాలకు ప్రమాదమేమీ లేదని ఇంజినీర్లు, నిపుణులు చెప్తున్నారని వెల్లడించారు. ఆగమేఘాల మీద సీఎం ప్రగతిభవన్ నిర్మించుకున్నారు కానీ... రెండు పడక గదుల ఇళ్లు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. ఇదే చిత్తశుద్ధి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ఎందుకు లేదని ధ్వజమెత్తారు.
కొత్త సచివాలయం, అసెంబ్లీ అవసరమేంటి? - ktr
ముఖ్యమంత్రి కేసీఆర్కు భవనాలు నిర్మించడంలో డబ్బులు ఉంటాయి కానీ... ప్రజలకు డబుల్ బెడ్ రూం నిర్మించడానికి మాత్రం నిధులు ఉండవు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో దీనిని బట్టే తెలుస్తుంది: తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్రెడ్డి
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో చిత్తశుద్ధి లేదు: రావుల