తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ... వాళ్లు రవివర్మ చిత్రాలయ్యారు! - LOCK DOWN TIME CREATIVITY

లాక్​డౌన్​ వేళ ప్రజలు తమ సృజనాత్మకతకు పని చెబుతున్నారు. తమ ఆసక్తులను, కళలను నెరవేర్చుకునేందుకు సమయాన్ని వినియోగించుకుంటున్నారు. బహ్రెయిన్‌లో స్థిరపడిన ఓ భారతీయురాలు... తను ఎంతో అభిమానించే రవివర్మ చిత్రాలను తన కూతుళ్లతో రిక్రియేట్​ చేసి ఎన్నో ప్రశంసలు పొందుతోంది.

RAVIVARMA PICTURES RECREATION IN BAHRAIN
లాక్​డౌన్​ వేళ... వాళ్లు రవివర్మ చిత్రాలయ్యారు!

By

Published : Apr 26, 2020, 5:05 PM IST

హంస చెబుతున్న నలుడి గాథలను ఎంతో ఆసక్తిగా వింటోన్న దమయంతిని చూడగానే... మనకు వెంటనే గుర్తుకొచ్చేది రాజా రవివర్మ అద్భుతమైన సృజనే. స్వచ్ఛమైన అందాలెన్నింటినో ఆయన కుంచె అలవోకగా అలా చిత్రాలుగా మలిచి... ఎందరినో ముగ్ధులను చేసింది. అలాంటివారిలో ఒకరు బహ్రెయిన్‌లో స్థిరపడిన భారతీయురాలు శీతల్‌జియో.

రవివర్మ చిత్రాలను ఎంతగానో అభిమానించే శీతల్‌జియో.. లాక్‌డౌన్‌ సమయంలో తన సృజనాత్మకతకు పని చెప్పింది. కూతుళ్లు కేథరీన్‌, క్లేర్‌లను రవివర్మ చిత్రాల్లోని మహిళల మాదిరిగా మేకప్‌ చేసి ఫొటోషూట్‌ తీసింది.

గొలుసే వడ్డాణంగా... కర్టెన్లు బ్యాక్​గ్రౌండ్​గా...

పిల్లలను అలా తయారుచేయడానికి ఎంతో కష్టపడిందట శీతల్‌. తన పొడవు గొలుసును పిల్లలకు వడ్డాణంలా మలచింది. పాత కర్టెన్లను ఫొటోలకు బ్యాక్‌గ్రౌండ్‌గా మార్చింది. ఆమె కష్టం వృథాకాలేదు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ చిత్రాలు ఎంతోమందికి బాగా నచ్చేశాయట.

ABOUT THE AUTHOR

...view details