విత్తనాలు, పురుగుల మందుల కంపెనీలు, ఫార్మా సంస్థలకు చెందిన డీలర్లు లక్ష్యాన్ని అధిగమిస్తే... వారికి ప్రోత్సాహాకాలు ఇవ్వడం, వినోదం పంచడం కోసం ఆయా యాజమాన్యాలు రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. పోలీసు నిఘా లేని, జన సంచారం లేని ఫామ్‌హౌస్‌లలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి, విందులు, చిందులతో డీలర్లను ఉత్సాహపర్చేందుకు పలు సంస్థల ప్రతినిధులు నిబంధనలను అధిగమిస్తున్నారు.
ఆన్లైన్లో ప్రవేశాలు...
ఈ పార్టీలలో కొంత మంది మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంస్థాన్ నారాయణపూర్ గిరీశ్, శ్రీకర్ అనే స్నేహితుల మరికొంత మంది స్నేహితులతో కలిపి డబ్బులు సంపాదించడానికి రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ప్రచారం నిర్వహించారు. ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి ప్రవేశం కోసం రూ. 500 వసూలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలకు అదనపు డబ్బులు వసూలు చేశారు.
యువతులతో చిందులు...
శివరాత్రి, దసరా, షబ్బే బరాత్ లాంటి పండగలున్నప్పుడు పోలీసుల దృష్టంతా బందోబస్తుపైనే ఉంటుందనే ఉద్దేశంతో రేవ్ పార్టీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి పార్టీలు నిర్వహిస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఒక్కొక్కరికి రూ. 3 వేల నుంచి రూ. 10వేల వరకు చెల్లిస్తున్నారు. కొన్నిసార్లు యువతులతో ఏకాంతంగా గడిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
పబ్బులు, స్టార్ హోటళ్లలో...
రెండేళ్ల కిందట వరకు హైదరాబాద్‌లోని పబ్బులు, స్టార్ హోటళ్లలోనే ఎక్కువగా రేవ్, ముజ్రా పార్టీలు జరిగేవి. గతేడాది జనవరిలో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఓ ఫార్మా సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో వైద్యులు, సేల్స్మెన్ల కోసం పబ్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.