రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు.
'తెల్లరేషన్ కార్డుదారులందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్' - Ration rice free for two months
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Ration rice free for two months
ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2,000, 25 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వారితో పాటు మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికీ.. అదే తరహాలో ఆర్థికసాయం, ఉచిత బియ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి.. కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం