తెలంగాణలో నిత్యావసర వస్తువుల పంపిణీ(RATION DISTRIBUTION) నిలిచిపోయింది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్(data centre)లో యూపీఎస్ ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్‌లైన్ సేవలు(online services) నిలిచిపోయాయి. మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ వెబ్‌సైట్లతోపాటు రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు నిలిపివేశారు. ఈ-పీవో సేవలు రేపట్నుంచి నిలిచిపోయి... ఆదివారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తాయి.
హైదరాబాద్ జంట నగరాల్లో అన్ని చౌక ధరల దుకాణాలు(pds shops) తెరిచే ఉంచడంతో లబ్ధిదారులు దుకాణాల వద్దకు వచ్చి ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజులపాటు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ ఉండదని... సోమవారం నుంచి వచ్చి సరుకులు తీసుకెళ్లాలని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి యథావిధిగా రేషన్ షాపుల్లో సరకుల పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.