తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్​ డీలర్ల కమీషన్​ సరిపోవడం లేదు: మోదీ

ఆహార భద్రతా చట్టం ప్రకారం.. రేషన్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వాలే రవాణా ఖర్చులు భరించాలని.. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్​మోదీ అన్నారు. ఆయా ఛార్జీలను డీలర్లపై వేయడం సరికాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అవుతానని.. డీలర్ల సమస్యలపై మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతామన్నారు.

prahlad modi
రేషన్​ డీలర్ల కమీషన్​ సరిపోవడం లేదు: మోదీ

By

Published : Nov 27, 2020, 10:45 AM IST

రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ దేశంలో ఒకే విధంగా ఉండాలని ప్రధాని మోదీ సోదరుడు, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ప్రహ్లద మోదీ అన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ సరిపోవడం లేదన్నారు.

హైదరాబాద్ లక్డీకపూల్ వాసవీ సేవా కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలే రవాణా ఖర్చులు భరించాలన్నారు. రేషన్ డీలర్ల​పై వేయడం సరికాదన్నారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి రేషన్ డీలర్ల సమస్యలు అధికమయ్యాయని ఆరోపించారు. జగన్​ను కలిసి రేషన్​ డీలర్ల సమస్యలపై మంచి నిర్ణయం తీసుకోవాలని వివరిస్తామన్నారు.

డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే.. దేశవ్యాప్తంగా రేషన్​ దుకాణాలు మూసివేసి, సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి:ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ... కొవాగ్జిన్​ పురోగతి పరిశీలన

ABOUT THE AUTHOR

...view details