Ration Card KYC Last Date: రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులు.. కేవైసీ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు.. రేషన్ సరకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014 నుంచి రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. రేషన్ కార్డుల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో.. వారందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ.. వాస్తవంగా చూసుకుంటే.. గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఎంతోమంది చనిపోగా... చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొంతమంది.. పెళ్లి తర్వాత కొత్త కాపురాలు పెట్టారు. దీంతో.. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకే అందాలనే ఆలోచనతో 'కేవైసీ' పేరిట రేషన్ కార్డుల వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది.
గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు!
KYC Last Date:అయితే ఇప్పటి వరకు రేషన్‌కార్డు కలిగిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రేషన్ షాపుకు వచ్చి వేలిముద్ర వేసి బియ్యం తీసుకునేవారు. అయితే తెలంగాణ గత ప్రభుత్వం.. రేషన్ కార్డు(Ration Card) కలిగిన ప్రతి కుటుంబంలో ఎవరెవరున్నారనే విషయం తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులంతా రేషన్ దుకాణానికి వచ్చి 'నో యువర్ కస్టమర్'(కేవైసీ) పేరిట వేలి ముద్రలు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా.. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా దీనికి తుది గడువును అధికారులు విధించారు. జనవరి 31వ తేదీలోగా లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు.
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ - మరో ఐదు సంవత్సరాల పాటు ఆ స్కీమ్‌ను పొడిగించిన కేంద్రం!
కేవైసీ ఎలా చేసుకోవాలంటే..: