రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన సన్న వరి ధాన్యానికి ధర నిర్ణయించి, కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. క్వింటాలుకు 2500 రూపాయల ధర నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో వానాకాలంలో 20 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేశారని తెలిపారు.
సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం - 2500 రూపాయల ధర
రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే రైతులు లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి నష్టపోయారని తెలిపారు. క్వింటాలుకు 2500 రూపాయల ధర నిర్ణయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం
అతివృష్టి, తెగుళ్ల కారణంగా లక్షల ఎకరాలలో వరిపంట దెబ్బతినిందని రైతుసంఘం నాయకులు వెల్లడించారు. ఎకరాకు 40 వేల రూపాయల పెట్టుబడి అవుతోందని, ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చౌకదుకాణాలకు, విద్యార్థులకు సన్న బియ్య పంపిణీ జరగాలంటే ప్రభుత్వమే ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.