తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు - Ratha saptami celebrations in AP

Ratha saptami celebrations in AP : ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పట్టువస్త్రాలు సమర్పించి.. తొలిపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల వరకు నిజరూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున ఆలయంలో బారులు తీరారు.

Ratha saptami celebrations
రథసప్తమి వేడుకలు

By

Published : Jan 28, 2023, 8:59 AM IST

Ratha saptami celebrations in AP : రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పట్టువస్త్రాలు సమర్పించి.. తొలిపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల వరకు నిజరూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు

భక్తుల ఆగ్రహం:అర్ధరాత్రి దాటిన తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సాధారణ భక్తులను పట్టించుకోలేదు. మరోవైపు క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్‌లో పర్యవేక్షణ అంతంతగా ఉండటంతో సాధారణ భక్తులు కూడా అదే వరుసలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో పలువురు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details