హైదరాబాద్ ముషీరాబాద్ మారుతీ నెక్సా కారు సర్వీసు సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం ఎలుక అని బయటపడింది. ఏడు నెలల క్రితం కారు సర్వీసు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కార్లు కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిన తర్వాత సుమారు రూ. ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.
ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్ - ముషీరాబాద్ మారుతీ నెక్సా షోరూం అగ్నిప్రమాదం వార్తలు
అనగనగా.. ఓ ఈగ. పూర్వ జన్మలో తనను చంపినందుకు విలన్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. చివరికి ఓ అగ్నిప్రమాదంతో చంపి తన ప్రతికారం తీర్చుకుంటుంది. ఈ కథ దర్శక ధీరుడు రాజమౌలి తీసిన ఈగ చిత్రంలోనిది. అయితే ఇప్పుడు ఆ చిత్రం గురించి ఎందుకని అంటారా..? తాజాగా అలాంటి సీన్ నిజజీవితంలో జరిగింది. అదెలాగో.. ఎక్కడో మీరే చూసేయండి.
ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్
విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో పోలీసులు భావించారు. అయితే తాజాగా సర్వీసు కేంద్రంలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఓ ప్రైవేట్ ఫోరోన్సిక్ ఏజెన్సీ విశ్లేషించింది. ఈ కేంద్రంలోని పూజ చేసేందుకు వెలిగించిన దీపపు వత్తిని... ఎలుక తీసుకుపోయి కుర్చీపై పారవేయడం వల్ల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది.