సినీ నటి రష్మీగౌతమ్ నగరంలో సందడి చేశారు. ఓ ప్రముఖ వస్త్ర కంపెనీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కామర్స్ వైబ్‌సైట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మీ కేట్‌కట్ చేసి పలువురికి అందించారు. ఆ షోరూమ్‌లో ఉన్న వస్త్రాలను ప్రదర్శించారు. రష్మీని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
భాగ్యనగరంలో సందడి చేసిన రష్మీ గౌతమ్ - ఓ వస్త్ర దుకాణంలో సినీనటి
హైదరాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సినీనటి, యాంకర్ రష్మీగౌతమ్ సందడి చేశారు. స్థానికంగా అభిమానులు రష్మీని చూసేందుకు ఎగబడ్డారు.
భాగ్యనగరంలో సందడి చేసిన రష్మీ గౌతమ్
ఆ వస్త్ర కంపెనీ అనతి కాలంలోనే 20 ఔట్‌లెట్ స్టోర్లను ప్రారంభించడం అభినందనీయమన్నారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేసుకుని ఆన్‌లైన్ వ్యాపారంలోకి అడుగుపెట్టిందని ఆ సంస్థ డైరెక్టర్ అన్నారు. వస్త్రాభిమానులకు ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా వస్త్రాలను వారి ముంగిట ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రష్మీతో పాటు ఆ సంస్థ ఎండీ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కొరియర్లో రియా ఇంటికి డ్రగ్స్ సరఫరా