హైదరాబాద్ చిక్కడపల్లి రాంనగర్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన శరత్ చంద్ర తన ఇద్దరు కుమార్తెలు సమీక్ష, సన్నిధిలతో కలిసి మేనత్త హిమబిందు ఇంటికి బయలుదేరాడు. రోడ్డు దాటుతుండగా వేగంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన యువకుడు ముగ్గురిని ఢీ కొన్నాడు. ఫలితంగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చిన్నారి మృతి, ఆస్పత్రిలోనే మరో ఇద్దరు - RASH DRIVING IN CHIKKADAPALLY
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాంనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సమీక్ష
అయిదు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులను ఆసుపత్రికి తరలించగా సమీక్ష నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. సన్నిధి, హిమబిందు తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇందుకు కారణమైన యువకుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.